Responsive Ads Here

How to Earn Money Online - Introduction

ఆన్లైన్  లో డబ్బులు సంపాదించడం ఎలా?

     ప్రపంచములో ప్రతి మనిషి కి డబ్బు చాలా అవసరం. డబ్బు లేనిదే ప్రపంచం లేదు. ప్రతి మనిషి డబ్బు సంపాదించడం కోసం ఎన్నో రకాలుగా శ్రమ పడుతూ ఉంటారూ. ప్రతి మనిషి కి ఎదో ఒక్క రకమైన అదనపు ఆదాయం కావాలి. ఎందుకంటే ప్రతి మనిషి నెల రోజులు ఉద్యోగం చేసి వచ్చే జీతం వారి కుటుంబ అవసరాలకు సరిపోకపోవచ్చు. దీని కోసం ప్రతి ఒక్కరు వేరే అదనపు ఆదాయాల మార్గాలు కోసం వెతుకుతూవుంటారు. కానీ ఏది కూడా వారి వారి తీరిక సమయం లో పనిచేసే ఉద్యోగం దొరకదు. ఒక్క వేళ దొరికినా శారీరక శ్రమతో అనారోగ్యం బారిన పడటం తప్ప ఫలితం ఉండదు. దీనికి ఒక్కటే పరిస్కారం మార్గం ఇంటర్నెట్ లో మన తీరిక సమయం లో పనిచేసి సంపాదించడం. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఆఫీస్ నుంచి తిరిగివచ్చాకా ఫ్రెషప్ అయ్యాకా మీ ఇంట్లో ఉన్న కంప్యూటర్ ముందు రిలాక్స్డ్ గా కూర్చుని పనిచేసి డబ్బులు సంపాదించడం మీకు శ్రమ అనిపించదు మరియు మీకు శారీరక శ్రమ ఉండదు. మీకు నచ్చితే చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. అంతా మీ ఇష్టం. మీకు మీరే యజమాని. మిమ్మలి ఆదేశించే వారే ఉండరు.
  
     మీ ఇంటి నుంచి పనిచేసి నెలకు రూ.10,000/- నుంచి రూ. 30,000/- వరకు సంపాదించండి అనే పత్రికా ప్రకటనలు, వాల్ పోస్టర్లు మనం చూస్తూ ఉంటాం. నిజమేనా అనే సందేహం కలగవచ్చు. కొంతమంది ఒక్కసారి ప్రయత్నం చేస్తే పోలా అని ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసేవారికి అర్ధమవుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైతే ప్రయత్నం చేసిచూదాము అని వెళ్లారో అక్కడ వారు మిమ్మల్ని రిజిస్ట్రేషన్ ఫీజు కట్టమంటారు, కలిబుల్లి మాటలు చెపుతారు, ఆశ చూపిస్తారు. మనము ఆశ పడి వెంటనే రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టిన తరువాత వారు మనము పనిచేయలేనటువంటి పని అప్పగిస్తారు, మీరు సరిగా పనిచేయలేదు అని డబ్బులు ఎగొడతారు. ఈ రకంగా మోసం చేస్తారు. మనకు మనము తిరుగాడే ప్రదేశాల లోనే జరిగే మోసాలను అరికట్ట లేక పోతున్నాము. మరి ఇంటర్నెట్ ప్రపంచము లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నెట్ ప్రపంచంలో ఎదుట వ్యక్తి ఎవరో మనకు తెలీదు కాబట్టి మనము ఎక్కడైనా పోయినా చేయగలిగినది ఏమి లేదు. పోలీస్ కేసు పెట్టినా దేశం కానీ దేశం లో ఆ వ్యక్తి గాని సంస్థను గాని పట్టుకోవడం కష్టతరమైంది. కాబట్టి జాగ్రత్త అనేది చాలా అవసరం. ఎక్కడా కూడా మీరు తొందరపడి డబ్బులు కట్టవద్దు అని నా మనవి. 
  
     నా బ్లాగులో నేను ఉదేశించే ఆదాయ మార్గాలు 100% పూర్తిగా ఉచితం. ఎక్కడా కూడా మీరూ డబ్బులు కట్టవలసిన పనిలేదు. 100% ఫ్రీ రిజిస్ట్రేషన్. 
ఇంటర్నెట్ ప్రపంచం అంతులేనిది, ప్రతి ఒకరు ఆన్లైన్ లో వారి వారి తీరిక సమయంలో పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు. కొద్దిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు. దీని కోసం ఎటువంటి ప్రత్యేకమైన విద్యా అర్హత అవసరం లేదు. 

     ప్రతి తెలుగు వారికి ఇంటర్నెట్ లో లభించే అదనపు ఆదాయ మార్గాలను తెలుపాలనాదే నా బ్లాగ్ యొక్క ముఖ్య ఉదేశం.

కొన్ని ముఖ్య గమనికలు:

1. ఇంటర్నెట్ లో నేను చెప్పే ఆదాయా మార్గాల ద్వారా మీరూ ఒక్కసారిగా ధనవంతులు అవ్వరు. 
2. నా బ్లాగ్ ద్వారా ఇంటర్నెట్ లో లభించే ఆదాయ మార్గాలు సమాచార సాధనగానే గుర్తించండి. మీ యొక్క సంపాదనకు నేను ఎట్టు వంటి హామీ ఇవ్వలేను. 
3. త్వరత్వరగా సంపాదించాలని అందరికి కోరికగా ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. ముందుగా తెలుసుకోండి, ఆచరణలో పేటండి, తరువాత ప్రతిరోజు 4 - 5 గంటలు కష్టపడండి.  తరువాత మీ సంపాదన నిజంగా మీ సంతృప్తి మేరకు మీరు చేరుతారు. 
4.  పైన చెప్పిన విధంగా రూ. 10,000/- నుంచి  30,000/- వరకు సంపాదించవారు ఉన్నారు. మీ ఆలోచన, మీ ఆచరణ, మీ శ్రమ ఎంతో అవసరం.

మరి ఇప్పుడు ఇంటర్నెట్ లో వర్క్ చేయటానికి మనకి ఏమి కావాలి. 

1. కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్. 
2. జిమెయిల్ ఎకౌంట్.
3. పేపాల్ అకౌంట్. (దీని గురించి తరువాత వివరిస్తాను). 
4. పర్సనల్ బ్యాంకు ఎకౌంట్. 
5. 4 - 5 గంటలు ఆన్లైన్ లో పనిచేయాలి అనే తపన, పట్టుదల. (ఇది చాలా అవసరం). 

ఇంటర్నెట్ ప్రపంచం లో అదనపు ఆదాయా మార్గాలు మనం చూదాం.
1. పైడ్ టు క్లిక్ 
2. ఆన్లైన్ సర్వేస్ 
3. డూయింగ్ క్యాప్చ వర్క్ 
4. అఫిలియేట్ మార్కెటింగ్ 
5. గూగుల్ యాడ్ సెన్స్  
6. బ్లాగింగ్ 
7. ఆన్లైన్ సేల్స్
ఇంతేనా అంటే కాదనే చెప్పాలి. మరిన్ని త్వరలో తెలియచేస్తాను. 
నేను చెప్పినది అర్ధం చేసుకొన్నారని అనుకొంటున్నాను. తరువాత ఏమి చేయాలో తెలుసుకోవటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.